![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -394 లో.. కృష్ణ, మురారీల స్క్రిప్ట్ అయిపోగానే ఇక పెద్దమ్మని అడిగి ఎవరు బెస్ట్ ఇచ్చారో కనుకుందామని మధు అంటాడు. అందరు భవాని వంక చూసేసరికి భవాని అక్కడ కనిపించదు అందరు ఆశ్చర్యంగా చూస్తారు. అప్పుడే ఒక గిఫ్ట్ తో భవాని వస్తుంది. రండి పెద్దమ్మ.. ఆ గిఫ్ట్ ఎవరికి ఇస్తారోనన్న ఎక్సయిట్ మెంట్ ఉందని మధు అంటాడు.
ఆ తర్వాత భవాని రెండు జంటలు బాగా చేశారు అంటుంది. నీలో మళ్ళీ పాత ఆదర్శ్ ను చూస్తున్నాను.. చాలా హ్యాపీగా ఉంది ఇలాగే ఉండు అని భవాని ఆదర్శ్ కి చెప్తుంది. గిఫ్ట్ మాత్రం కృష్ణ మురారీలకి ఇస్తు బాగా చేశారు.. ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండండి అని చెప్తుంది. అందరు ముకుంద ఆదర్శ్ లకి ఇస్తారని అనుకుంటారు. కానీ వాళ్ళకి కాకుండా వీళ్ళకి ఇచ్చేసరికి అందరు ఆశ్చర్యంగా చూస్తారు. నాకు తెలుసు అంతత్వరగా నాపై అత్తయ్యకి నమ్మకం రాదని ముకుంద తన మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత మీ అందరితో ఒక సీరియస్ విషయం మాట్లాడాలని భవాని హాల్లోకీ తీసుకొని వెళ్తుంది. నేను ఒక నెల రోజులు అమెరికా వెళ్తున్నాను.. మా ఫ్రెండ్ కి ఏదో ప్రాబ్లమ్ అంట అందుకే వెళ్తున్నానని చెప్తుంది. ఎప్పుడు వెళ్తున్నారని కృష్ణ అడుగుతుంది. రేపే వెళ్తున్నాను.. ఇప్పుడు బయలుదేరాలని భవాని చెప్తుంది. ఇక ఎందరికి ఒక్కొక్కరిగా జాగ్రత్తలు చెప్తుంది భవాని.
అ తర్వాత అందరికి చెప్పి నాకు చెప్పట్లేదని ముకుంద అడుగుతుంది. నీకు చెప్పేది ఏం ఉంది.. మారింది నిజమే కదా హ్యాపీగా ఉండండి అని భవాని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు బానే చేశారు కదా వాళ్ళకి కాకుండా మాకు గిఫ్ట్ ఇచ్చారని కృష్ణ అనుకుంటుంది. మురారి కూడా అలాగే అనుకుంటాడు. అప్పుడే రేవతి వస్తుంది. రేవతిని అదే డౌట్ అడుగుతారు. భర్త తాగి వస్తే లోపలికి పిలిచి ఇంకా తాగండి అంటు మందు పోస్తే.. ఆ భర్త ఆరోగ్యం పాడవుతుంది. ఎలా మంచి భార్య అవుతుంది. నువ్వు నీ భర్త తాగి వస్తే కఠినంగా ఉన్నావ్. నువ్వు మంచి భార్యవి. అందుకే మీకు గిఫ్ట్ ఇచ్చిందని రేవతి చెప్తుంది. ఆ తర్వాత నీ చేతితో మందు ఇస్తే తాగాలని ఉందని ఆదర్శ్ అనగానే ఆదర్శ్ కి ముకుంద మందు ఇస్తుంది. తరువాయి భాగంలో అందరిని కృష్ణ పిలుస్తుంది. భవాని ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసి చూడగా అందులో ఒక చిన్న పాప బొమ్మ ఉంటుంది. అందులో ఒక లెటర్ కూడా ఉంటుంది. తింగరి నీలో ఒక అమ్మ ఉంది. నువ్వు అమ్మవి అవుతే చూడాలని ఉందని భవాని రాసినట్టుగా ఉంటుంది. అది చూసి కృష్ణ ఎమోషనల్ అవుతుంది. ఇది నాకు మాత్రమే కాదు ముకుందకి కూడా అని కృష్ణ అనగానే.. ముకుంద షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |